![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2 '. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -92 లో.... కార్తీక్ అంటూ ప్రతిసారి దీపని శౌర్య అడుగుతు విసిగిస్తుంది. నువ్వు అలా కార్తీక్ అనకు అని దీప అనగానే.. మరి ఇప్పుడు మనం కార్తీక్ దగ్గరకి వెళ్తున్నామా అని శౌర్య అడుగుతుంది. లేదు నువ్వు కాసేపు సైలెంట్ గా ఉండమని శౌర్యతో దీప అంటుంది. నీపై గట్టిగా అరవలేను.. బాధపెట్టలేనని దీప తనలో తాను అనుకుంటుంది.
మరొకవైపు కార్తీక్ ఎక్కడ అని శ్రీధర్ అడుగుతాడు. ప్రొద్దున వెళ్ళాడని కాంచన అంటుంది. ఎక్కడికి వెళ్తున్నావంటూ అంటూ అడగలేదా అని శ్రీధర్ అంటుండగా.. అప్పుడే జ్యోత్స్న వస్తుంది. కాసేపటికి కార్తీక్ కూడా వస్తాడు. దీప దొరికిందా బావ అని జ్యోత్స్న అడుగుతుంది. లేదని కార్తీక్ అంటాడు. దీప ఇల్లు కాళీ చేసి వెళ్ళిపోయిందని శ్రీధర్ వాళ్ళకి జ్యోత్స్న చెప్తుంది. అదేంటీ చెప్పకుండా ఎందుకు వెళ్ళిందని శ్రీధర్ అంటాడు. శౌర్యకి ఫీవర్ గా ఉంటే రాత్రి దీప తనని తీసుకొని హాస్పిటల్ వెళ్ళింది. నాకు కాల్ చేస్తే వెళ్లనని కార్తీక్ అంటాడు. అదేంటో మా ఇంట్లో మనిషి కన్పించకపోతే నిన్ను అడగవలసి వస్తుంది.. ఎందుకు అంటే తన బాధ్యత నువ్వు తీసుకున్నావ్ గనుక.. దీప కన్పిస్తే చెప్పు బావ అంటూ జ్యోత్స్న వెళ్ళిపోతుంది. మరొకవైపు దీప వంట చేస్తు.. మీ వాళ్లే మాకు ఇలాంటి సిచువేషన్ వచ్చింది బాబు అంటూ కార్తీక్ అన్న మాటలు గుర్తుచేసుకుంటుంది. మేమ్ ఇక్కడున్నట్టు కార్తీక్ బాబుకి తెలియదు ఒకవేళ తెలిస్తే వచ్చేవాళ్ళని దీప అనుకుంటుంది. అప్పుడే కార్తీక్ అంటూ గోడకి పేరు రాసి మాట్లాడుకుంటుంది శౌర్య. అది చూసిన దీప షాక్ అవుతుంది.
మరొకవైపు సుమిత్ర వాళ్ళు దీప గురించి మాట్లాడుకుంటుంటారు. అప్పుడే పారిజాతం, జ్యోత్స్న అక్కడికి వెళ్తారు. మీరు దీపని ఏమైనా దీప అన్నారా అని పారిజాతాన్ని సుమిత్ర అడుగుతుంది. ఇది బాగుంది నేను ఎందుకు అంటాను. అవసరం కోసం వచ్చింది.. పని ఉంటే వెళ్ళిపోయిందని పారిజాతం అంటుంది. ఇదంతా పక్కన పెట్టి జ్యోత్స్న, కార్తీక్ ల పెళ్లి కి ముహూర్తం పెట్టాలని పారిజాతం అనగానే.. సరే ఈ రోజు వెళ్లి కాంచనతో మాట్లాడండి అంటూ శివన్నారాయణ అంటాడుమ ఆ తర్వాత పారిజాతం, జ్యోత్స్న లు దీపని వెతకడానికి వెళ్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |